మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కి తన మద్దతు తెలిపి తన అనుచరులు, శ్రేయోభిలాషులు సుధాకర్ యాదవ్ కే మద్దతు తెలిపి గెలుపుకు సహకరించాలన్నారు. శుక్రవారం ఖాజీపేటలో డిఎల్ రవీంద్రారెడ్డిని వారి స్వగృహంలో టిడిపి నాయకులు 195 బూత్ ఇన్చార్జి గౌస్ మొహిద్దిన్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి దుస్సాలువ, పూల దండ వేసి సన్మానించారు.