రుణదాత వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మదనపల్లె 2 టౌన్ పోలీసుల వివరాల మేరకు పట్టణంలోని చంద్ర కాలనీలో ఉండే సతీశ్ భార్య చిన్న సుబ్బమ్మ(21) అదేకాలనీలో ఉండే వాణి వద్ద రూ. 30 వేలు అప్పుజేసింది. సకాలంలో నగదు చెల్లించలేదని వాణి చిన్నసుబ్బమ్మ ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడింది. దీంతో మనస్థాపంతో ఆమె శుక్రవారం విషద్రావం తాగింది. జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.