రెండు రోజుల నుంచి ఏపీలో రాజకీయ క్రీడలు జరుగుతున్నాయని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ పై దాడి ఒక డ్రామా అని అన్నారు. ఏపీలో ప్రజలను పక్కదారి పట్టించే విధంగా సాక్షి రాతలు ఉన్నాయన్నారు. రాయి ఘటనకు వ్యూహకర్త సజ్జల అని పేర్కొన్నారు. మాటువేసి మట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని సాక్షిలో రాసుకున్నారన్నారు. వైసీపీ నేత ఔతూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో నాలుగు రోజుల్లో సంచలనం సృష్టించే న్యూస్ ఉంటుంది అని సోషల్ మీడియాలో పెట్టారని కనకమేడల తెలిపారు. ‘‘గతంలో శ్రీధర్ రెడ్డి అనే అతను జడ్జీలను సైతం బెదిరించారు. జడ్జీలను తిడుతూ పెట్టిన పోస్టుపై చర్యలు తీసుకోవాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సంచలనం ముందే తెలుసా ? సీఎం పర్యటనలో మనుషులనే కాదు చెట్లనూ నరికేశారు.14 వ తేదీన సీఎం భద్రతను గాలికి వదిలేశారు? సీఎంపై రాయి ఘటన తర్వాత సాక్షిలో కథనం రాయడం దానికి మంత్రులు గగ్గోలు పెట్టడం రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేశారు. విజయవాడలో సీఎం పర్యటన అంటే నాలుగు గంటల ముందు ట్రాఫిక్ బంద్ చేస్తారు’’ అని కనకమేల అన్నారు.