జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం గతంలో గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ లిస్టులో గాజు గ్లాసు చేర్చడంతో జనసేన పార్టీ వర్గాలు గందరగోళంలో ఉన్నాయి.
ఈసీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఫ్రీ సింబల్స్‌ను విడుదల చేస్తుంటుంది. ఇందులో భాగంగా గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో విడుదల చేసింది. దీంతో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాజు గ్లాసు గుర్తు తమకే ఇవ్వాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
గాజు గ్లాసు గుర్తు కోసం తాము ముందుగా దరఖాస్తు చేసుకుంటే జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని పిటిషన్లో పేర్కొంది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. అయితే మంగళవారం తీర్పు వెలువరిస్తూ రాష్ట్రీ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసు తమకే వస్తుందని జనసేన వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికల సమయంలో.. ఒకవేళ ఎన్నికల సంఘం ఈ గుర్తును మార్చేస్తే ఇబ్బందులు తప్పవని జనసేన పార్టీ భావిస్తోంది. అందుకే గాజు గ్లాసు గుర్తు విషయంలో ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తోంది. గతంలో అయితే గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తాజాగా ఈ గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడంతో టెన్షన్ మొదలైంది. మరి ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa