వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు తీరని ద్రోహం చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేసారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్ లోని దేవాపురంలో జరిగిన జయహో బిసి ముగింపు సభలో జోన్ 5 టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర, పెమ్మసాని రవి, తాళ్ల వెంకటేష్, నిమ్మల శేషయ్యలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ... బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తూ మరోసారి రానున్న ఎన్నికల్లో మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో బీసీలకు సీఎం జగన్ చేసిన మేలేంటో చెప్పాలని డిమాండు చేశారు.
రిజర్వేషన్లలో కూడా కోత విధించారని ఆరోపించారు. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్ళించి బీసీల నోట్లో వైసీపీ ప్రభుత్వం మట్టి కొట్టిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటుచేసారని, అదే కోవలో చంద్రబాబు అనేక పథకాలు, పదవులతో గౌరవం కల్పించారన్నారు. బీసీలకు తగిన న్యాయం దక్కాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి పేరయ్య, అడక శ్రీనివాస్,ఈశ్వర్, కన్నా రజిని, ఆళ్ల హరి , పోపూరి నరేంద్ర, చంద్రగిరి బాబు, చింతకాయల శివ, అలివేలమ్మ,వినోద్,గోపి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు నగరంలోని గొట్టిపాటి కళ్యాణ మండపం నందు విశ్రాంత ఉద్యగుల మరియు గుంటూరు సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి పెమ్మసాని శ్రీ రత్న గారితో కలిసి హాజరయ్యిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి గారు.