దేశవ్యాప్తంగా 7.8 కోట్ల మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్ఓపై రూ.944 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, గతేడాది ఉన్న మిగులు నిధులతో ఆ నష్టాన్ని భర్తీ చేయనున్నారు.ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో 7 కోట్ల మందికిపైగా చందాదారులు ఉన్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.15 శాతంగా నిర్ణయించారు. ఆ తర్వాత 2023- 24 ఆర్థిక సంవత్సరంలో 8.25 శాతానికి పెంచారు. అప్పటి నుంచి ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ 8.25 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa