కొడగు జిల్లాలో శుక్రవారం హిట్ అండ్ రన్ కేసులో బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం విషాదంగా మారింది.ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తను కారు ఢీకొట్టింది.ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కుశాలానగర్ తాలూకా వల్నూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి భారీగా జనం గుమిగూడారు.పోలీసులు ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa