నంద్యాల జిల్లాలో చికిత్స పొందుతూ ఇద్దరు రైతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల మండలం ఎం.పెండేకల్ గ్రామానికి చెందిన చెవిటి చిన్న పుల్లయ్య (37) అనే రైతు ఈనెల 17న అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం బేతంచెర్ల సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవార మృతి చెందాడు. మృతుడి భార్య దస్తగిరమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఏఎస్‌ఐ తెలిపారు. అదేవిధంగా బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామానికి చెందిన పసుపుల చిన్న మద్దిలేటి (51) అనే రైతు అప్పుల బాధతో ఈ నెల 16న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ మాసూమ్ తెలిపారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
![]() |
![]() |