‘చింతలపూడి అభివృద్ధే నా లక్ష్యం.. గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాది’ అని చింతలపూడి టీడీపీ కూటమి అభ్యర్థి సొంగా రోషన్ అన్నారు. చింతలపూడిలో శుక్రవారం రాత్రి కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన యువజాతర ర్యాలీ నిర్వహించారు. బోసుబొమ్మ సెంటర్, ఫైర్‌స్టేషన్ సెంటర్‌లలో ఆయన మాట్లాడుతూ... గెలిచిన కొద్దిరోజుల్లోనే చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్, నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని వెంటనే పరిష్కారం చేస్తానన్నారు. ఎన్‌ఆర్‌ఐగా సంపాదించుకుని వచ్చానని, డబ్బుకోసమో, కమీషన్‌ల కోసమో రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. తనతో పాటు ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌ను గెలిపించే బాధ్యత యువనాయకులదేనన్నారు.
![]() |
![]() |