తంబళ్లపల్లె నియోజవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి శుక్రవారం నామినేషన దాఖలు చేశారు. ములకలచెరువు పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా జయచంద్రారెడ్డి ఉదయం నామినేషన దాఖలు చేసేందుకు బయలుదేరారు. నామినేషన దాఖలు చేసేం దుకు జయచంద్రారెడ్డితో పాటు నియోజకవర్గ ప్రచార సమన్వయ కర్త సీడు మల్లికార్జున నాయుడు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేం ద్రయాదవ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పోతుల సాయి నాధ్, టీడీపీ నేత మంత్రి గిరిధర్‌రెడ్డి, బీజేపీ నేత గోపాల్‌రెడ్డి తది తరులు వెంట వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన పత్రాలు అందజేశారు. అలాగే జయచంద్రారెడ్డి సతీమణి కల్పనరెడ్డి కూడా నామినేషన దాఖలు చేశారు.
![]() |
![]() |