తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి శుక్రవారం నామినేషన దాఖలు చేశారు. స్థానిక నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అశ్మితరెడ్డి అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ముందుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం జేసీ పవనరెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని పోలీ్‌సస్టేషన సమీపంలో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుగ్గరామలింగేశ్వరునికి అశ్మిత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి నుంచి బయలుదేరిన అశ్మితరెడ్డి, పవనరెడ్డి సంజీవనగర్ మొదటిరోడ్డు, పుట్లూరురోడ్డు మీదుగా గాంధీసర్కిల్‌కు చేరుకున్నారు. అనంతరం నామినేషన దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా శుక్రవారం జేసీ అశ్మితరెడ్డి నామినేషన పత్రాలను రిటర్నింగ్ అధికారి రాంభూపాల్‌రెడ్డికి అందించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని భాస్కర్‌రెడ్డి బలపరిచారు.
![]() |
![]() |