ఒక్కగానొక్క కొడుకు వివాహాన్ని ఘనంగా చేయాలన్న ఆ తల్లి ఆశ నెరవేరకుండానే ఆమె అందని లోకాలకు వెళ్లిపోయిన ఘటన నందిగాం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజిని (48) తన కుమారుడు రమేష్‌కు ఈనెల 24న వివాహం చేసేందుకు అవసరమైన సామాన్లు కొనుగోలుకు శుక్రవారం కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై పలాస వెళ్లింది. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వజ్జీలపేట సమీపంలో హైవేపై ద్విచక్ర వాహనం నుంచి సరోజిని జారిపడి తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. తల్లి మృతి చెందడంతో జీర్ణించుకోలేక కుమారుడు రమేష్ కన్నీటి పర్యం తమయ్యాడు. సరోజిని మృతితో కుటుంబంలోను, గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త రామన్న ఉన్నారు. మృతురాలి సోదరుడు జలుమూరు వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహ్మద్ అమీర్ ఆలీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |