రాయదుర్గం మండల పరిధిలోని వేపరాళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం రాయదుర్గం నియోజకవర్గం నోడల్ ఆఫీసర్ పి జయచంద్ర విస్తృత అవగాహన కల్పించారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఓటు హక్కు అనునది వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం, తదితరులు పాల్గొన్నారు.