శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం దండురోడ్డులోని అభయ ఆంజనే యస్వామి ఆలయంలో సీతా రాముల కల్యాణాన్ని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా అర్చకులు స్వామివార్లకు కల్యాణోత్సవం జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూ ర్ణానంద స్వామిజీ హాజరై సీతారాముల కల్యాణం విశిష్ట తను తెలియజేశారు.