ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను (CAT) వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది. వేరే అంశాలు ఏవీ నోట్ ఫైల్‌లో లేవని బెంచ్ పేర్కొంది. ఛార్జ్ షీట్ నాలుగుసార్లు వేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వాదనతో సంభదం లేకుండా రికార్డ్ ఉందంటూ బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పెగాసిస్, మీడియాతో మాట్లాడిన అంశాలపై ఏబీ వెంకటేశ్వర రావు స్పష్టంగా రిప్లై ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. పరిశీలించకుండా రెండవ సారి సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. అవే ఆరోపణలపై రెండవ సారి విచారణ ఏమిటంటూ ప్రశ్నించిన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.. తదుపరి విచారణణు ఈనెల 29కి వాయిదా వేసింది.