ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.తాజాగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఎన్నికల విధులతో సంబంధం లేని బాధ్యతలు అప్పగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఈసీ తన ఆదేశాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.