మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా మిథున్ రెడ్డిని, రైల్వే కోడూరు శాసనసభ్యులుగా శ్రీనివాసులుని గెలిపించుకోవాలని కోడూరు మండల వైసిపీ కన్వీనర్ సుధాకర్ రాజు కోరారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు రైల్వే కోడూరు గాంధీ నగర్ నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.