ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని సచివాలయం రెండవ పరిధిలోని 32 మంది వాలెంటర్లు బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కు రాజీనామా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు మేరకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నామని అన్నారు.