ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈనెల 26వ తేదీ వరకు జిల్లాలో 2. 21 కోట్ల నగదు 3, 000 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటివరకు రూ. 4. 92 కోట్ల మేర ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు. శుక్రవారం వరకు 62 వాలంటీర్లను తొలగించగా, 2, 714 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.