ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:31 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బద్వేల్ నియోజక వర్గం, పోరు మామిళ్ల మండలాల్లో బుధవారం షర్మిల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పుట్టింది ఇక్కడేనని.. ఇది నా గడ్డ అని తెలిపారు.ఇక్కడే ఉంట..ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతానని స్పష్టం చేశారు.ప్రత్యేక హోదాను సాధించుకొని వస్తానని హామీ ఇచ్చారు. జగన్  వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆయన ఆశయాలను ఒక్కటి కూడా జగన్ అమలు చేశారా అని నిలదీశారు.వైఎస్సార్ కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశారని విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో కడప ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గతంలో కడప ఎంపీగా వైఎస్సార్ కూడా పని చేశారని గుర్తుచేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా సైతం ఎంపీగా గెలిచారని తెలిపారు. ఇప్పుడు వైఎస్సార్ బిడ్డ కూడా కడప ఎంపీగా పోటీ చేస్తుందని ఉద్ఘాటించారు. వైఎస్ వివేకాను హత్య చేయించిన వ్యక్తి ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి అని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa