ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతాంగానికి తోడ్పాటు అందిస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:32 PM

మన అభిమాన హీరో చిరంజీవినే  అవమానించిన జగన్ ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. బుధవారం మండపేట బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని.. రైతాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తామన్నారు. పోలీస్, రెవిన్యూ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో ద్వారంపూడి కుటుంబం రాష్ట్ర సంపదను దోచేస్తుందని ఆరోపించారు. 2014లో టీడీపీ, బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.కులాల్ని దాటి వెళ్ళకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందన్నారు. తోట త్రిమూర్తులు, పిల్లి బోస్‌లు రాజకీయ శత్రువులని.. ఇప్పుడు రాజకీయ అవసరాలు కోసం కలిసిపోయారన్నారు. తోట త్రిమూర్తులు జనసేనలోకి రావటం లేదని స్పష్టం చేశారు. ద్రాక్షారామలో కాపు కళ్యాణమండపం నిర్మాణం చేపడతామని చెప్పి.. స్థలం కాజేసి రెండేళ్లుగా కళ్యాణమండపం నిర్మించలేదన్నారు. ఏపీని జగన్ పాలన నుంచి విముక్తి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa