ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:35 PM

రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వ మద్యం షాపుల్లో నాసిరకం మద్యం విక్రయించి జగన్‌ అండ్‌కో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలారెడ్డి అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట నాలుగురోడ్ల జంక్షన్‌లో పి.గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ న్యాయ యాత్ర రోడ్‌షోలో ఆమె ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి ఇస్తానన్న జగన్‌ మిగిలిన బిడ్డలను దత్తత తీసుకుంటాడా అన్నారు. పి.గన్నవరం నియోజకవర్గానికి సీఎం జగన్‌ వచ్చినప్పుడు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ద్వారా అనేక హామీలు ఇచ్చారని ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. గోదావరి వరదల సమయంలో కాజ్‌వేలు ఏర్పాటు, రివిట్‌మెంట్‌ నిర్మాణం వంటి హామీలు నేటికి గాలిలోనే ఉన్నాయన్నారు. ప్రధాన రహదారులు గోతులమయంగా ఉన్నా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రం, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ, పంటలకు పెట్టుబడికి రుణాలు, మద్దతు ధర కల్పిస్తామన్నారు. రాజన్న బిడ్డ మీ ముందుకు వచ్చిందని, గతంలో రాజశేఖర్‌రెడ్డి ప్రజల కోసం ఎలా ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అందించారో అదే విధంగా అందిస్తానన్నారు. ప్రత్యేక హోదా సాధన, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేలా కృషిచేస్తానన్నారు.అనంతరం ఎంపీ అభ్యర్థి జంగా గౌత మ్‌, అసెంబ్లీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబులను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, అయితాబత్తుల సుభాషిణి, ములపర్తి మోహనరావు, నెల్లి వెంకటరమణ, ఆదుర్తి నారాయణమూర్తి, నేతల నాగరా జు, నాగవరపు నాగరాజు, పితాని ఆనందరావు, మహ్మద్‌ ఇస్మా యిల్‌, కొండేటి వెంకటేశ్వరరావు, ధర్మారావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa