ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద ఎన్నికల స్పెషల్ టీంలు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా రూ.2,07,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు కైకలూరు రూరల్ ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఎన్నికల ప్రత్యేక టీంలు ఈ తనిఖీలు నిర్వహించాయి. కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి చెందిన పెన్మెత్స వెంకట రామకృష్ణంరాజు రూ.2,07,000లు నగదును కారులో తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ నగదును ఆక్వా చెరువులకు ఖర్చులు నిమిత్తం తీసుకువెళుతున్నట్లు రైతు పేర్కొన్నాడు. అయితే సంబంధిత ధ్రువీకరణపత్రాలు అందజేయాలని రైతుకు సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదును కైకలూరు రిటర్నింగ్ అధికారి కె. భాస్కర్‌కు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa