ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:36 PM

భార్య కాపురానికి రావడంలేదనే అక్కసుతో భర్త తన చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కరప పోలీసులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కరప మండలం వేములవాడకు చెందిన కరెడ్ల వీరవెంకటసుబ్రహ్మణ్యానికి మూడేళ్ల క్రితం వేళంగికి చెందిన వీరలక్ష్మితో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. గ్రామ వలంటీర్‌గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యం ఏడాది క్రితం భార్యను వదిలేసి అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. కాగా మంగళవారం అక స్మాత్తుగా వేళంగిలోని అత్తవారింటికి వెళ్లి కుమార్తెను తనకి చ్చేయాలని భార్యతో ఘర్షణకు దిగాడు. వారు ప్రతిఘటించడంతో బ్లేడ్‌తో తన చెయ్యిని కోసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa