వైసీపీ పతనం మొదలైందని ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పక్కదోవ పట్టించి ఐదేళ్ల పాటు దోపిడీ చేసి పాలన సాగించారని విమర్శించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చందలూరు గ్రామానికి చెందిన శ్రీలత, శైలజతో పాటు మరో పది కుటుంబాలు టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సౌరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa