ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరాన్ని పూర్తి చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:38 PM

కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల్లో నమ్మకాన్ని నింపుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. పట్టణంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేసేలా ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రోత్సాహకాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల పునరుద్ధరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఏటా నాలుగు లక్షల ప్రకారం.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీకి కూటమి మేనిఫెస్టో హామీ ఇచ్చిందని అన్నారు. తొలి సంతకం మెగా డీఎస్పీపై ఉంటుందని స్పష్టం చేశారు. దళితులు, మైనార్టీల సంక్షేమానికి మేనిఫెస్టో అధిక ప్రాధాన్యం ఇస్తోందని, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, నాయీబ్రాహ్మణులకు, రజకులకు, యాదవులకు ప్రత్యేక హామీలు ఇచ్చిందని తెలిపారు. వ్యవసాయాన్ని బతికించడంతోపాటు లాభసాటిగా మార్చడానికి హామీలను పొందుపరిచారని అన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని, నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తూ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి పెద్దపీట వేస్తామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడంతో పాటు కియ లాంటి పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa