ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్‌కు జగన్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా? అని అడిగారు. అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని విరుచుకుపడ్డారు. ‘వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండగ. నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు లేడు. పంట నష్ట పరిహారం అని మోసం చేశాడు. ధరల స్థిరీకరణ నిధి అని ఛీట్ చేశాడు. నిరుద్యోగ బిడ్డలను వంచనకు గురిచేశాడు. 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి, అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఇవ్వాళ్టికి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నేను వైఎస్ఆర్ బిడ్డ.. పులి బిడ్డ. నా గుండెలో దమ్ముంది. న్యాయం కోసం ఎంపీగా పోటీ చేస్తున్నా. మళ్ళీ నిందితుడికి ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయం. మీరు న్యాయం వైపు ఉంటారా ? అన్యాయం వైపు ఉంటారో కడప గడ్డ ప్రజలు ఆలోచన చేయాలి. నేను పుట్టింది ఇక్కడే...ఇది నా గడ్డ. ఇక్కడే ఉంట.. ప్రజా సేవ చేస్తా అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa