ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:41 PM

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ పార్టీ తరపున ఎలమంచిలిలో సుందరపు విజయకుమార్‌, పెందుర్తిలో పంచకర్ల రమేశ్‌బాబు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. వారితో పాటు కూటమి అభ్యర్థులకు మద్దతుగా పలు నియోజకవర్గాలో ఆయన ప్రచారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం మూడు గంటలకు ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం వెళతారు. అక్కడ సభలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం ఆరు గంటలకు పెందుర్తి జంక్షన్‌లో ఏర్పాటుచేసే సభలో ప్రసంగిస్తారు. రాత్రికి విశాఖపట్నం చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. గురువారం ఉదయం పాలకొండ వెళ్లి అక్కడ ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రానికి తిరిగి విశాఖపట్నం చేరుకొని నగరంలో రోడ్‌ షో చేస్తారు. మొదట విశాఖ దక్షిణ నియోజక వర్గంలో, ఆ తరువాత కూటమి అభ్యర్థులు విష్ణుకుమార్‌రాజు, గణబాబులు పోటీ చేస్తున్న ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలు కలిసే ఉండే ప్రాంతాలు, ఆ పై గాజువాక వెళ్లి అక్కడ పల్లా శ్రీనివాసరావు తరఫున ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. పార్టీ తరఫున ఈ పర్యటనకు సంబంధించి ఎటువంటి ప్రకటన జారీ చేయకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa