2024 ఐపీఎల్ లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కి ఈ మ్యాచ్ జరగనుంది. ముంబై జట్టు 10లో మూడు విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. కోల్‌కతా జట్టు 9లో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మొత్తం 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై 23 మ్యాచ్‌లు, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే ఈ సీజన్లో లో కోల్‌కతానైట్ రైడర్స్ 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 3 మ్యాచ్‌లు గెలుపొందింది. ముంబై 2 మ్యాచ్ లు గెలిచింది. కానీ ఈ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ వాంఖడే మైదానంలో కాబట్టి ముంబై ఇండియన్స్ విజయం సాధించే అవకాశం వుంది. ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరగగా, కోల్‌కతా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగా, ముంబై 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఎవరికీ అనుకూలంగా మారుతుంది అని ఇరు జట్ల అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa