మేదరమెట్ల గ్రామానికి చెందిన వెంకట నర్సయ్య కొన్నేళ్లుగా చీటీపాట నిర్వహిస్తున్నారు. ఈయన వద్ద 80 మందికి పైగా వివిధ చీటీలు వేస్తున్నారు. ఈ క్రమంలో గత 5 నెలల నుండి చీటీలు పాడుతున్న వారికి నగదు చెల్లించలేదు, 10 రోజుల నుంచి ఆ వ్యక్తి గ్రామంలో కనిపించకపోవడంతో, ఆందోళన చెందిన బాధితులు శుక్రవారం మేదరమెట్ల పోలీసులను ఆశ్రయించారు. నరసయ్య అందరికీ కలిపి సుమారు 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ విషయంపై తమకు న్యాయం జరిపించాలని, ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ ను బాధితులు వేడుకొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa