ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మామిడి దుకాణంపైకి దూసుకు వెళ్లిన లారీ ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 01:50 PM

ఉలవపాడు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడి లోడ్ తో నూజివీడు నుంచి పలమనేరు వెళ్తున్న లారీ ఉలవపాడు సమీపంలోకి రాగానే లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే మామిడికాయలు విక్రయించే దుకాణంపైకి దూసుకువెళ్లింది. దుకాణం నిర్వాహకురాలు ఉలవపాడుకు చెందిన ధన్యాసి కొండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కోడలకి కాలు విరిగింది. ఈ మేరకు ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa