ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 03:54 PM

ఎన్నికల నియమావళికి విరుధ్ధంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతోపాటు తెలుగుదేశం పార్టీ,లియో యూట్యూబ్ ఛానల్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీనేతలు నారాయణమూర్తి, శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల సంఘానికి ఆధారాలను అందించారు.చంద్రబాబు నాయుడు పార్టీ వెబ్ సైట్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై, వైయ‌స్ఆర్‌సీపీ పై దురుధ్దేశ్యప్రకటనలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం. పవన్ కల్యాణ్ మే 1 వతేదీన పెందుర్తి సభలో వైయస్ జగన్ గారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు,నిరాధార ఆరోపణలు చేశారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ప్రజలను భయాంధోళనలకు గురిచేస్తున్న లియో యూట్యూబ్ ఛానల్ పై చర్య తీసుకోవాలని ఎన్నికల కమీషన్ ను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa