ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ నాయకత్వం మెచ్చిన ఎన్నారైలు జగన్ నాయకత్వం మెచ్చిన ఎన్నారైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 03:56 PM

సమాజంలో మార్పుకోసం వైయస్ఆర్‌సీపీ  ఎన్నారైలు పనిచేస్తున్నారని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలియచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జగన్ కోసం సిధ్దం బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ  విజయం కోసం జగన్ గారిపై అభిమానంతో ఎన్నారైలు ఏర్పాటుచేసిన సిధ్దం బస్సులను ప్రారంభించడం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.వేరే దేశాలలో ఉన్న ఎన్నారైలు వైయస్సార్ సిపికోసం ఇక్కడకు వచ్చి పనిచేయడం ఆహ్వానించదగ్గ అంశం అన్నారు.జగన్ గారి గెలుపు ప్రతి ఇంట్లో గెలుపులాగా ప్రజలు భావిస్తున్నారన్నారు.రాష్ర్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ యాత్ర ఉంటుందని జగన్ గారు అమలు చేసిన పధకాలు గురించి వివరించడం జరుగుతుందన్నారు. పార్టీ తరపున,ముఖ్యమంత్రి జగన్ గారి తరపున తమకు మధ్దతు ఇస్తున్న ఎన్నారైలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వివరించారు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున పనిచేస్తున్న ఎన్నారైలు వికృత ఛేష్టలు చేస్తున్నారని తెలిపారు.కోమటి జయరాం అనే ఎన్నారై అహంకారంతో మాట్లాడుతూ.....  ఓటర్లను కొనాలని భావిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటైన అంశం అన్నారు.రాజకీయం అంటే ప్రజలకు సేవచేయడం అని ప్రతి ఒక్క నాయకుడు భావించాలన్నారు.జగన్ గారు అదే నిత్యం చెబుతారని వివరించారు. రాజకీయం అంటే డబ్బు అని చాలా మంది భావిస్తుంటారని తెలియచేశారు.నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారని జగన్ గారు ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి వైయస్సార్ సిపికి మధ్దతు ఇచ్చే ఎన్నారైలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.సమాజంలో మార్పును ప్రజలకు తెలియచేయడానికి వారు పనిచేస్తున్నారని అభినందించారు.రాష్ర్ట వ్యాప్తంగా నాలుగుబస్సులలో స్టార్ క్యాంపెయినర్లు పనిచేస్తారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మేడపాటి వెంకట్, చల్లా మధుసూధన్ రెడ్డి,పండుగాయల రత్నాకర్,పుత్తాప్రతాపరెడ్డి,నారాయణమూర్తి పలువురు ఎన్నారైలు,పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa