ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 06:30 PM

మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణ‌యించ‌బోతుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. విలువలను, విశ్వసనీయతలను గెలిపించడానికి మీరు సిద్ధమా? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపే అన్నారు. గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామ‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa