కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారని వైయస్ఆర్ సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించామని సీఎం వైయస్ జగన్ చెప్పారు.