బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట, పిల్లలపల్లి గ్రామాలలో సోమవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. వారికి వైసిపి నాయకులు, గ్రామస్థులు, మహిళలు పూలవర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైసిపి గెలిచిన వెంటనే దుర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.