రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ లో ప్రజలనుద్దేసించి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలను సర్వనాశనం చేసిన ఘనత సైకో జగన్ మోహన్ రెడ్డి దే అని అన్నారు. ప్రజలందరూ కూటమి అభ్యర్థులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.