ధర్మవరంలోని బాలుర కళాశాల మైదానంలో ఓ గుర్తుతెలియని శవం లభించింది. సోమవారం ఉదయం మైదానానికి వెళ్లిన క్రీడాకారులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవం వద్దకు వెళ్లి పరిశీలించగా ఒక వృద్ధుడి మృతదేహంగా గుర్తించారు ఇంతవరకు మృతుడి ఆచూకీ వివరాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.