సి ఎస్ పురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు భైరవకోనకు తరలివచ్చి సుందరమైన జలపాతంలో స్థానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముఖ దుర్గామాదేవి, కాలభైరవేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.