పేదల సంక్షేమమే సీఎం జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని వైసీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు. ఆదివారం సంతనూతలపాడు మండల పరిధిలోని మట్టిగుంట, మద్దిరాల ముప్పాళ్ళ, ఓమ్మెవరం, కండ్లగుంట గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.