మెగాబ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంత అన్యోన్యంగా ఉంటారనేదీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజకీయంగా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అన్న నాగబాబు ఎంత సపోర్ట్‌గా ఉంటారనేదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. తమ్ముడి పార్టీ విజయం కోసం శ్రమిస్తున్నారు నాగబాబు. ఒక దశలో నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే పొత్తుల లెక్కల్లో ఆ సీటు బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే పోటీచేసే అవకాశం దూరమైనా కూడా నిరుత్సాహ పడకుండా పవన్ కళ్యాణ్‌కు, జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు నాగబాబు. పిఠాపురంలో పవన్ విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం పూర్తైన తర్వాత.. పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వివరించేలా.. నాగబాబు చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. పవన్ ఫ్యాన్స్ కూడా ఉద్వేగానికి లోనై కామెంట్లు పెడుతున్నారు.
"నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే 'చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని..నీతో నడవని వాళ్ల కోసం కూడా ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే 'వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని 'రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని..అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!" అని నాగబాబు ట్వీట్ చేశారు.
పోలింగ్‌కు ముందు నాగబాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగబాబు ఎమోషనల్ ట్వీట్‌కు కనెక్ట్ అవుతూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి గురౌతున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద నాగబాబుకు ఉన్న ప్రేమ ఈ ట్వీట్ ద్వారా వ్యక్తపరిచారని అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa