శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల"ప్లస్"గా మార్పు చేస్తూ విద్యా శాఖ అవకాశం కల్పించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2024 -25లో ఎంపీసీ, బైపిసి, సీఈసీ గ్రూపులను ప్రారంభిస్తూ ప్రతి గ్రూపులో 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa