ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని రాష్ట్రం లో ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారన్నారని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని మాజీ సీఎం, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కు మార్రెడ్డి కూటమి శ్రేణులకు చెప్పారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకులతో మాట్లాడుతూ.... ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని తెలియజేసినట్లు చెప్పార న్నారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకోసం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతగానో శ్రమించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారన్నారు. వాల్మీకి పురం పోలింగ్ కేంద్రాలలో వైసీపీ దౌర్జన్యాలు తెలిశా యని త్వరలోనే లెక్క సరిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కాగా పీలేరు మండలానికి చెందిన అధిక శాతం టీడీపీ నేతలు నగిరిపల్లెకు చేరుకుని నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డిని కలిసి తమ తమ ప్రాంతాల్లో పోలింగ్ సరళిని వివరించారు. వైసీపీ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత నిన్నటి పోలిం గ్లో ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని, మంచి మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వారు కిశోర్‌కు తెలిపారు. చాలా మంది రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి తమ ప్రాంతాల్లోనూ ఆయనకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు.