ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం, వైయస్ జగన్మోహన్రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దేశచరిత్రలోనే ముందెన్నడూ ఎరుగని విధంగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం పనితీరును మెచ్చిన పాజిటివ్ ఓటింగ్ ప్రభావం కనిపించనుందన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా మహిళా అక్కచెల్లెమ్మలంటూ వైయస్ జగన్ గొప్ప పరిపాలనతో వారి ఆదరాభిమానాలు పొందారన్నారు. ఈ క్రమంలో ఆయా వర్గాలన్నీ సరైన తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా చూడబోతున్నామని చెప్పారు.