మే 16 ప్రపంచ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ. ఆడ ఈజిప్ట్ దోమ కుట్టడం వలన డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందని, ఈ దోమ కుట్టడం వల్ల మనుషుల్లో కళ్లు మంటలు, శరీరంపై దద్దుర్లు, ఎక్కువగా దాహం కావడం, త్వరితగతిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు బయటపడితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa