మదనపల్లె పట్టణంలోని కదిరిరోడ్డులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 18 వరకు స్వామివారి 331వ ఆరాధనోత్సవాలు నిర్వ హిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పి. లక్ష్మీనారాయణాచారి, నవయుగ స్వర్ణకారు ల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అప్పినిపల్లె భాస్కరాచారి తెలిపారు. ఈ నెల 17న ఆలయంలో వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయ ట్రస్టు, నవ యుగ స్వర్ణకారుల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం మదనపల్లె సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదానం నిర్వహించనున్న ట్లు వారు తెలిపారు. బుధవారం ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, 9 గంటలకు నవగ్రహారాధన చేశారు. స్వామివార్లకు పంచామృతాభిషేకం అనంతరం నవగ్రహ హోమం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళహారతితోపాటు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa