ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో సిమెంట్ లారీ బీభత్సం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 05:13 PM

కడప జిల్లా ముద్దనూరులో సిమెంటు లోడు లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి రైల్వే గేట్లను ఢీకొని సెంటర్‌లో ఉన్న బట్టల షాపులోకి లారీ దూసుకెళ్లింది. దీంతో బట్టల షాపు, రెండు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడమే ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa