పార్వతీపురం పట్టణ శివారులోని గిజబ కాలనీ సమీపంలో ఉన్న జంఝావతి కాలువలో ఆదివారం ఉదయం మృతశిశువు కనిపించడంతో స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సంతోషి వెంటనే జంఝావతి కాలువ వద్దకు చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నెలలు నిండకముందే పుట్టడం వల్ల మృతి చెందినట్లు ఆరోగ్య సిబ్బంది తెలియజేశారని చెప్పారు. మృతశిశువును ఇలా కాలువలో పడేయడం సరికాదని, దర్యాప్తు నిర్వహించి, అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.