తనకు పోలీసులే అన్యా యం చేశారని, న్యాయం చేయాలని ఎస్పీ గరుడ్ సుమిత్ వద్ద బాధితుడు వాపోయాడు. ఆదివారం సాయంత్రం ఒంగోలు స్థానిక సాగర్ సెంటర్లో మాక్ డ్రిల్ జరుగుతున్న సందర్భంగా వినుకొండ సుబ్బయ్య అనే బాధితుడు ప్లకార్డు పట్టుకొని ప్ర త్యక్షమయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ వద్దకు వెళ్లి 2021లో కనిగిరి పొలీసులు తనకు అన్యాయం చేశారని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. టింబర్ డిపోను లీజుకు తీసుకొని నడుపుతుండగా యజమానికి మద్దతుగా పోలీసులు వ్యవహరించారని, ఇప్పు డైనా తనకు న్యాయం చేయాలని సుబ్బయ్య కోరారు. పరిశీలించి న్యాయం చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.