కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో సోమవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీవారి ఆలయం చుట్టూ మబ్బులు చేరి ముగ్ధమనోహరమైన దృశ్యం కనువిందు చేసింది. శ్రీవారి ఆనంద నిలయాన్ని ఆ మబ్బులు వచ్చి తాకుతున్నాయా అన్నట్లుగా.. మేఘాలు ఆనంద నిలయాన్ని ఆవరించాయి. ఈ వాతావరణం తిరుమల శ్రీవారి భక్తులను కట్టిపడేసింది. కెమెరాల్లో వీటిని బంధిస్తూ భక్తులు ఎంజాయ్ చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు వారాంతం కావటంతో ఆదివారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంది.